2015లో ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ సినిమా ఇండస్ట్రీకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.( Anupama Parameswaran ) ఈ హీరోయిన్ పేరు చెబితే యూత్ అంతా పిచ్చెక్కిపోతారు.
చాలామంది ఈ అమ్మడుకు ఫ్యాన్స్.ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పటి తరం.దాంతో పాటు యూత్ కి అనుపమ అంటే పిచ్చి క్రష్ కూడా.అయితే ఎందుకో అనుపమ అనుకున్న స్థాయిలో అయితే హిట్స్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయింది.
దాదాపుగా ఏటా రెండు మూడు సినిమాలు చేస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్స్ సరసర చేరలేకపోయింది.దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు తన హద్దులను చెరిపేసుకుంది అని మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

డీజే టిల్లు సీక్వెల్( DJ Tillu Sequel ) సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) సరసన నటిస్తోంది.ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్స్ లో అనుపమ తెగ రెచ్చిపోయి ముద్దులు ఇస్తూ కుర్రకారుకు మతులు పోగొట్టేసింది.అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు పరిస్థితి ఏంటా అని ప్రస్తుతం అందరికి అనుమానం వస్తుంది.ఇప్పటి వరకు పద్ధతిగా సినిమాలు చేస్తూ వచ్చిన అనుపమ ఒక్కసారిగా తన పద్ధతికి సంకెళ్లు తెంపేసింది.
దాంతో అందరూ ఇప్పుడు ఆమెను మరింత సెక్సీగా, హాట్ యాక్టర్ గా చూడాలని అనుకుంటున్నారు.కానీ అనుపమ పరమేశ్వరన్ లో ఆ కసి మాత్రం కనిపించడం లేదు.

ఎందుకంటే ఈ అమ్మడు ప్రస్తుతం కేవలం ఒకే ఒక చిత్రంలో నడుస్తుంది.అది కూడా మలయాళ సినిమా.దాని తర్వాత ఆమె ఏ చిత్రాలు అంగీకరించలేదు.ఈ ఏడాది ఈగల్, సైరెన్ వంటి రెండు సినిమాల్లో నటించినా డీజే టిల్లు సినిమా మీద ఆమె గంపడాన్ని ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన ఇక అనుపమ ఆశలు గల్లంతే.ఇది కాకుండా మలయాళం లో JSK ట్రూత్ షెల్ ఆల్వేస్ ప్రీవెయిల్( JSK Truth Shall Always Prevail ) అనే ఒక సినిమా లో నటిస్తోంది.
ఈ సినిమాతో అయినా విజయాన్ని అందుకొని ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.ఏది ఏమైనా హద్దులు దాటుతున్న అనుపమ కెరియర్ కాస్త గందర గోళంలోనే ఉంది అనుకోవచ్చు.







