ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ కేసులో పలువురు ప్రముఖులకు సిట్ తాఖీదులు ఇస్తుంది.
ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.అదేవిధంగా కేరళ ఎన్డీఏ కన్వీనర్ తుషార్, జగ్గు స్వామితో పాటు లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చింది సిట్.ఈనెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.41 (ఏ) సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది.మరోవైపు సిట్ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.సదరు నోటీసులపై స్టే ఇవ్వాలని ప్రేమేందర్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.కేసుతో సంబంధం లేని వారికి నోటీసులు ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు.