Mahesh Babu Jawan : మనసులో మాట బయటపెట్టిన షారుఖ్.. మహేష్ తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నా అంటూ?

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌( Jawan ).తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Shah Rukh Khan Says He Wants Watch Jawan With Mahesh Babu-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మహేష్ బాబు( Mahesh Babu ) ఈ సినిమాపై స్పందిస్తూ జవాన్ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు మహేశ్‌ తెలుపుతూ తాజాగా ట్వీట్‌ చేశారు.ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవాలంటూ ఆయన కోరుకున్నారు.

ఆ ట్వీట్ పై స్పందించిన షారుక్ ఖాన్.థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌.

జవాన్ సినిమా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.నువ్వు ఎప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే, నేను కూడా నీతో కలిసి సినిమాకి వస్తాను.

నీకు, నీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు అని షారుఖ్‌( Shah Rukh Khan ) తన ట్వీట్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ చూసి మహేష్ బాబు అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆ ట్వీట్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా విడుదలైన జవాన్ సినిమా విషయానికి వస్తే.అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జవాన్.ఇందులో షారుఖ్‌ దాదాపు 7 గెటెప్స్‌లో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించిన విషయం తెలిసిందే.దీపికా పదుకొణె ( Deepika Padukone )అతిథి పాత్రలో కనిపించారు.

ఇకపోతే హీరో మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.ఈ సినిమా మొదలై దాదాపు ఏడాది అవుతున్నా కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube