Mahesh Babu Jawan : మనసులో మాట బయటపెట్టిన షారుఖ్.. మహేష్ తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నా అంటూ?

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌( Jawan ).

తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మహేష్ బాబు( Mahesh Babu ) ఈ సినిమాపై స్పందిస్తూ జవాన్ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు మహేశ్‌ తెలుపుతూ తాజాగా ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవాలంటూ ఆయన కోరుకున్నారు.ఆ ట్వీట్ పై స్పందించిన షారుక్ ఖాన్.

థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌.జవాన్ సినిమా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.

నువ్వు ఎప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే, నేను కూడా నీతో కలిసి సినిమాకి వస్తాను.

"""/" / నీకు, నీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు అని షారుఖ్‌( Shah Rukh Khan ) తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ చూసి మహేష్ బాబు అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ట్వీట్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా విడుదలైన జవాన్ సినిమా విషయానికి వస్తే.

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జవాన్.ఇందులో షారుఖ్‌ దాదాపు 7 గెటెప్స్‌లో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించిన విషయం తెలిసిందే.దీపికా పదుకొణె ( Deepika Padukone )అతిథి పాత్రలో కనిపించారు.

"""/" / ఇకపోతే హీరో మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఈ సినిమా మొదలై దాదాపు ఏడాది అవుతున్నా కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

వేడెవడండీ బాబు.. ఏకంగా మొసలి నోట్లోనే తలపెట్టేసాడు.!(వీడియో)