ఆ ఇద్దరే : వైసీపీ కొంప ముంచారు కదయ్యా  ? 

ఏదైతేనేం ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోర పరాజయం పాలయ్యింది.ఊహించిన స్థాయిలో టిడిపి కూటమి విజయం సాధించింది .

 Sajjala Ramakrishna Reddy Dhanunjaya Reddy Responsible For Ycp Lost In Ap Electi-TeluguStop.com

సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ కు( Jagan ) ప్రజలు ఊహించిన స్థాయిలో షాక్ ఇచ్చారు.ఈ పరాజయం నుంచి అప్పుడే వైసిపి కోలుకునేలా కనిపించడం లేదు.

జనాలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా,  ఈ స్థాయిలో ఘోర ఓటమి ఎదురవడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు.అసలు ఈ స్థాయిలో ఓటమికి గల కారణాలు ఏమిటంటే.

  ఆ పార్టీ నేతలు విశ్లేషణ చేసుకుంటూ ఈ ఐదేళ్లలో తమకు ఎదురైన చేదు అనుభవాలతో పాటు, ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు .ముఖ్యంగా జగన్ స్వయంకృపరాధమే ఈ ఓటమి కి కారణం అని చాలా మంది ఆ పార్టీ నేతల అభిప్రాయం.జగన్ ఎవరిని కలవకపోవడం , ఎవరిని నమ్మకపోవడం,  కొంతమంది కోటరీ నాయకులు,  అధికారులనే గుడ్డిగా నమ్మి వాస్తవం ఏమిటో తెలుసుకోకుండా వారు ఇచ్చిన సమాచారాన్ని నిజమని భావించడం, ఇవన్నీ ఓటమి లో భాగస్వామ్యం అయ్యాయని వారు చెబుతున్నారు.

Telugu Ap, Iasdhanunjaya, Jakkampudi Raja, Janasena, Tdp Alliance, Ycp, Ysrcp-Po

జగన్ చుట్టూ ఉన్న కోటరీ నాయకులు,  అధికారులే పార్టీ కొంప ముంచారని,  వారిని నమ్మి జగన్ నిండా మునగారని వాపోతున్నారు ముఖ్యంగా జగన్ కోటరీ లో  కీలకంగా ఉన్న ధనుంజయ రెడ్డి ,( Dhanunjaya Reddy ) సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) పైనే నేతలు అంతా ఫైర్ అవుతున్నారు.సీఎం పేషీ లో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించే వారు.జగన్ ఏం చేయాలో,  ఎవరిని కలవాలో కూడా ఆయనే నిర్ణయించే వారిని , ఎవరికి టికెట్ దక్కాలన్నా  ధనుంజయ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందేనని,  దానికోసమే జగన్ ను ప్రసన్నం చేసుకునే కంటే,  ధనుంజయ రెడ్డి ఆశీస్సుల కోసం నేతలంతా ప్రయత్నాలు చేసేవారట.

టికెట్ దక్కని వారికి ధనుంజయ రెడ్డి టీమ్ బుజ్జగింపులు కూడా చేపట్టేదట.తాజాగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు,  రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా( Jakkampudi Raja ) ధనుంజయ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Telugu Ap, Iasdhanunjaya, Jakkampudi Raja, Janasena, Tdp Alliance, Ycp, Ysrcp-Po

ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని మండిపడ్డారు.సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ను కలిసి పరిస్థితి ఉండేది కాదని జక్కంపూడి రాజా విమర్శించారు.  ధనుంజయ్ రెడ్డితో పాటు ,వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పైన అనేక విమర్శలు పార్టీ నేతలు చేస్తున్నారు.అంతా ఆయనే అన్నట్లుగా వ్యవహరించే వారని ,జగన్ కు తప్పుడు సమాచారం అందించడంలోనూ సజ్జల ముందుండే వారని , చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ముదిరినా,  వాటిని పరిష్కరించకుండా ఇరు వర్గాల్లో ఒక వర్గానికి మద్దతుగా ఉండేవారని, అన్ని శాఖలలోనూ సజ్జల జోక్యం చేసుకుంటూ పార్టీని,  ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించారని వైసిపి నేతలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube