దేశ ప్రజల జాతకంలో ఏం దోషం ఉందో గానీ కాలు బయటపెడితే చాలు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం మాత్రం కలగడం లేదు.ఇలా అన్నీ దార్లో మృత్యువు ఫ్యాక్షనిస్టులా కాచుకు కూర్చుంది.
చేతికి చిక్కితే చాలు అపహరించుకు పోవడానికి సిద్దంగా ఉంది.
ఇప్పటికే కరోనా వల్ల మనుషుల ప్రాణాలు దోమల్లా రాలిపోతుంటే, మరో వైపు రోడ్దు ప్రమాదాలు వణికిస్తున్నాయి.
ఇకపోతే తాజాగా తిరుపతిలోని కర్ణాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.ఒక్కసారిగా జనాలపైకి వేగంగా బస్సు దూసుకెళ్లింది.అంతటితో ఆగకుండా రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టి ఆగింది.
ఇక బస్సు సృష్టించిన విధ్వంసంలో మూడు ద్విచక్ర వాహనాలు డ్యామేజ్ అవ్వగా, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా మృతుల్లో ఓ మహిళ కూడ ఉన్నదట.కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యాడని సమాచారం.
ఇకపోతే ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద తీరు పై దర్యాప్తూ ప్రారంభించారట.ఇందులో భాగంగా డ్రైవరు కోసం గాలింపు చర్యలు చేపట్టారట.
ఇక మరణించిన మృతుదేహాలను హస్పటల్‌కు తరలించినట్లు తెలిపారు.