టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు.ఇక స్టార్ హీరోలకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.
అంతేకాకుండా తమ అభిమాన హీరోల సినిమాలు వస్తే చాలు అభిమానులు చేసే సందడి వేరేలా ఉంటుంది.ఇదిలా ఉంటే స్టార్ హీరోలందరినీ కలిసి చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఎందుకంటే వాళ్లంతా తమ ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉంటారు.
మామూలుగా అయితే స్టార్ హీరోలంతా ఒకేసారి కలవాలంటే సినీ ఇండస్ట్రీలో ఎవరిదైనా హీరో, స్టార్ దర్శకుల ఫంక్షన్, పెళ్లి వేడుకల సమయంలోనే కలుస్తారు.
ఇక రియల్ లైఫ్ లో వాళ్ళంతా ఒకే చోట ఉంటే అక్కడ ఆ సందడి వేరే ఉంటుంది.అందరూ ఒకే చోట కలిసి మాట్లాడుకోవడం జరగడం వంటిది కాస్త ఆలస్యంగా అయినా ఊహించుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది.
కానీ తాజాగా ఓ ఫోటోలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలంతా ఒకే చోట కలిసి ఉండి అందరినీ షాక్ చేశారు.

ఇప్పటివరకు వాళ్లంతా ఒకే చోట ఎప్పుడు ఉంటారా అనుకున్నామా! కానీ తాజాగా వాళ్ళంతా ఒకే చోట ఉన్న ఫోటో బయటపడింది.కానీ అది ఫోటో కాదు ఒక ఆర్టిస్ట్ వేసిన పెన్సిల్ ఆర్ట్.ఇందులో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ల ఫోటోలు ఉండగా.
అందులో అందరు హీరోలు చేతిలో టీ కప్పు పట్టుకొని కలిసి ముచ్చటిస్తున్నారు.వీళ్లంతా ఒకే చోట కలిసి ఉంటే చూడముచ్చటగా ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఇంతకీ ఈ ఆర్ట్ వేసింది ఆర్టిస్టు హర్ష.
ఈయన వేసిన ఆర్ట్ కు నెటి జనులు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.