సౌత్పోర్ట్ (ఇంగ్లండ్): తొలిసారి మిస్టర్ వరల్డ్ టైటిల్ ని ఓ భారతీయుడు, అందునా హైదరాబాద్‌కు చెందిన రోహిత్ గెలుచుకున్నాడు.ఇంగ్లండ్‌లో జరిగిన ఫైనల్లో మొత్తం 47 మంది పాల్గొన్నప్పటికీ టైటిల్ మాత్రం రోహిత్‌ని వరించింది.
టైటిల్తోపాటు 50 వేల డాలర్ల ప్రైజ్మనీని కూడా గెలుచుకున్నాడు.రోహిత్ మిస్టర్ వరల్డ్ టైటిల్‌తో పాటు ఇప్పటికే మల్టీమీడియా, మిస్టర్ వరల్డ్ టాలెంట్, మాబ్స్టార్ పీపుల్స్ చాయిస్ అవార్డు, మిస్టర్ వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్లాంటి సబ్టైటిల్స్ కోసం కూడా పోటీ పడగా, మిస్టర్ మల్టీమీడియా టైటిల్ అతని సొంతమైన విషయం తెలిసిందే.
రోహిత్ హైదరాబాద్ లోనే పుట్టి, ఇక్కడే పెరిగాడు.అరోరా డిగ్రీ కాలేజ్ లో చదివి స్పైస్ జెట్,, డెల్ కంపెనీలలో పనిచేశాడు.
ఆపై ముంబైకి చేరి, మోడలింగ్ లో కెరీర్ ను ప్రారంభించాడు.ఫ్యాషన్, గ్లామర్ ఇండస్ట్రీలో మంచి పేరున్న సబీరా మర్చంట్, సుప్రీత్ బేడి, జమునా పై, సందేశ్ మాయేకర్, అమిత్ ఖన్నా, స్వరూప్ మేదర, రుక్సానా ఐసాలాంటి వారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు.
ఫిట్నెస్ పెంచుకోవడానికి, పోటీల్లో భాగంగా అన్ని శారీరక సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఫుట్బాల్, సర్క్యూట్ శిక్షణలతోనూ రాటుదేలాడు.
కాగా రెండో స్థానంలో ప్యూర్టోరికోకు చెందిన యువకుడు, మూడో స్థానంలో మెక్సికో కు చెందిన అభ్యర్థి నిలిచారు.
తన కల సాకారమైందని , తాను ఎక్కడున్నా తన మనసు ఎప్పుడు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూనే ఉంటుందని చెబుతున్నాడు