క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ధిక్కార స్వరాలు పెరిగాయి.నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంగిస్తున్నారు.
కొంతమంది పక్క పార్టీలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని ఉన్న పార్టీని వీడేందుకు ధిక్కార స్వరాలు వినిపిస్తుండగా .మరికొంతమంది తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదంటూ అసమ్మతి గళం వినిపిస్తున్నారు.ఈన్నికలకు ఇంకా ఏడాది లోపే సమయం ఉండడంతో ఎవరిని గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి పార్టీలో ఉంది.

తెలుగుదేశంలో క్రమశిక్షణ ఎంత తప్పిందంటే.సాక్ష్యాత్తు చంద్రబాబు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతూ అధినేతకు తలనొప్పిగా మారారు.వేర్లో కొంతమంది పార్టీ వీడనున్నారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
ఇదే కోవలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరడం ఖాయం అన్న వార్తలు మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నాయి.అదేవిధంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి కూడా బాబుతో కనీసం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు.
కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు, జిల్లా మహానాడుతో పాటు విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా స్వయంగా లోకేష్‌తో సహా ఇతర నాయకులు పిలిచినప్పటికీ రాలేదు.తాజాగా చంద్రబాబు కర్నూలు పర్యటనలో కూడా బీసీ జనార్థనరెడ్డి కనిపించలేదు.
దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది
ఇదేవిధంగా పర్యాటక మంత్రి అఖిలప్రియ కూడా చంద్రబాబు పర్యటనకు డుమ్మా కొట్టింది.స్వయంగా చంద్రబాబు కోటరీ నుంచే ఆమెకు సమాచారం ఇచ్చి మరీ.సభకు పిలిచినప్పటికీ అఖిలప్రియ మాత్రం సభకు హాజరుకావడానికి ఇష్టపడలేదు.మొత్తంగా చూస్తే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా టిడిపిలో ఉన్న అసంతృప్త నాయకులందరూ కూడా ఇప్పుడు బాబును బేఖాతరు చేస్తున్నారు.
వాళ్ళకు నచ్చినట్టుగా బాబు నడుచుకుంటేనే సవ్యంగా ఉంటాం….లేకపోతే బాబుకే బొమ్మ చూపిస్తాం అనే తరహాలో వ్యవహరిస్తున్నారు.
క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఈ విధంగా జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పార్టీలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా చంద్రబాబు సైలెంట్ గా ఉండడానికి కారణం మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు.
ఈ మధ్యకాలంలోనే చాలా కులాలు టీడీపీకి దూరం అయ్యాయి.ఈ తలనొప్పి చాలదు అన్నట్టు ఇప్పుడు సొంత పార్టీ నేతల అసమ్మతి టీడీపీ కొంప ముంచేలా ఉంది
ఒక ప్రాంతీయ పార్టీలో అధినేతను పార్టీలో ఉన్న ఇతర నాయకులు ఈ స్థాయిలో అవమానించడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
చంద్రబాబు నాయకత్వ పటిమపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది.అసలే ఎన్నికల ఏడాది… ఆపై 2014 ఎన్నికల్లో మిత్రులయినవాళ్ళతో పాటు కొత్తగా బ్రాహ్మిణులు, ఎస్సీ ఎస్టీలు కూడా పూర్తిగా టిడిపికి శతృవులైన పరిస్థితి.
మరోవైపు సొంత పార్టీలో నాయకుల తలనొప్పి.మొత్తంగా చూస్తే టిడిపి పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందన్న విశ్లేషణలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి.