కేసీఆర్ ఆలోచ‌న‌ను ఫాలో అవుతున్న జ‌గ‌న్‌.. అందుకే ఆ నిర్ణ‌యం..

ఏపీలో రెండో సారి అధికారం చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నారు.గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో వైసీపీ కోసం ప‌ని చేసిన ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ మ‌రో సారి వైసీపీ గెలుపు కోసం ప‌ని చేస్తుంద‌ని సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

 Jagan Is Following The Kcr Idea  Hence The Decision Jagan, Kcr,ap News-TeluguStop.com

వ‌చ్చే ఏడాది నుంచి కిశోర్ రంగంలోకి దిగి.క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితి స‌మీక్షించ‌నున్నారు.

అయితే వైసీపీ నేత‌ల‌లో మాత్రం ప్ర‌శ్న త‌లెత్తుతొంద‌ట‌.అసెంబ్లీ ఎన్నిక‌లకు ఇంక చాలా స‌మ‌యం ఉండ‌గా సీఎం జ‌గ‌న్ ఎందుకు తొంద‌ర ప‌డుతున్నారో వారికి అర్థం కావ‌డం లేద‌ట‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న చేస్తున్నా అనే చ‌ర్చ జోరందుకుంది.గ‌తంలో తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది.ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్లో కూడా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసీఆర్ ను అనుచ‌రిస్తున్న‌ట్టు సందేహాలు ఉన్నాయి.

అందు కోసమే ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ ను ముందుగా రంగంలోకి దింపాల‌ని చూస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది.

Telugu Ap, Jagan, Narendra Modi, Ysrcp-Telugu Political News

మ‌రో వాద‌న కూడా తెర‌పైకి వ‌చ్చింది.కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే చూస్తోంది.ఈ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ముందుగానే వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతొ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలా బావిస్తున్నార‌నే చ‌ర్చ కూడా ఉంది.

ఎన్నిక‌లు ఎప్పుడోచ్చినా వాటి ఎదుర్కొవాల‌నే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శాంత్ కిశోర్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు.ఎన్నిక‌ల సుమారు మూడేండ్లు ఉండ‌గానే సీఎం జగన్ పీకే టీమ్‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని ఊహాగానాలకు తెరలేపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube