పొంగులేటి షర్మిల పార్టీలో చేరకపోవడం వెనక ఇంత కథ ఉందా ?

ఖమ్మం జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన కీలక నేతల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరు.2019లో భారతీయ రాష్ట్ర సమితి తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) ఆ పార్టీలో అసమ్మతి నేతగా తయారయ్యారు.చాలాకాలం వేచి చూసిన బారాస ఇటీవల ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది .అయితే ఆర్థికంగా ఆర్దికం గా బలమైన రాజకీయ వేత్త కావడం తో రాజకీయంగా చక్రం తిప్పాలన్న తన కోరికను తీర్చుకునే పార్టీ కోసం ఆయన అన్వేషణ కొనసాగుతుంది ….

 Resons Behind Ponguleti Srinivasa Reddy Back Step Towards Ysrtp , Ponguleti Sri-TeluguStop.com
Telugu Ts, Yssharmila, Ys Jagan, Ysrtp-Telugu Political News

ఆయనను పార్టీలోకి తీసుకొని కోరిన టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ భాజపాల సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన తన అనుచరులతో సహాఒక ప్యాకేజీల బేరం మాట్లాడుతున్నారని జాతీయ పార్టీలు అయినందున ఆ విషయంలో త్వరగా నిర్ణయాలు రాక ఆయన ఇంతవరకు ఏ పార్టీలోనూ చేరలేదని వార్తలు వస్తున్నాయి.అయితే ఇంతకు ముందు వైఎస్ఆర్ టిపిలో చేరడానికి ఆయన ఆసక్తి చూపించారు ….అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు .

Telugu Ts, Yssharmila, Ys Jagan, Ysrtp-Telugu Political News

ఆయన అలా సడన్ గా మనసు మార్చుకోవడానికి కారణాలేమిటో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు అయితే ఇటీవల ఆయన తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )ని కలిసిన తర్వాత పొంగులేటి రాజకీయ భవిష్యత్తు జగన్ డైరెక్షన్లో నడుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి ….2014లో వైసిపి అభ్యర్థిగా ఖమ్మం ఎంపీ సీటును గెలుచుకున్న పొంగులేటి అప్పటినుంచి జగన్ తో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారని, రాష్ట్రాల విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన బారాసా( BRS party )లో చేరారని అయితే ఇప్పటికీ జగన్తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని అనేక వ్యాపారాలలో కాంట్రాక్టులు కూడా ఆయన దక్కించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి .

Telugu Ts, Yssharmila, Ys Jagan, Ysrtp-Telugu Political News

వైయస్సార్ టిపిలో చేరకుండా పొంగులేటిని అడ్డుకున్నది జగనే అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ….షర్మిల రాజకీయ పార్టీ పట్ల అంత ఆసక్తి లేని జగన్ ఆ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉండదంటూ పొంగలేటి ని నిలువరించారని అందుకే ఆయన వెనకడుగు వేశరని ఇప్పుడు కొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి.…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube