సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు, నటీనటులకు కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.వాటిని ఎక్కువగా సినిమాల పరంగానే చూపిస్తుంటారు.
ముఖ్యంగా దర్శకులకు మాత్రం బాగా సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.వాళ్లు తీసే ప్రతి సినిమాలో ఒక సెంటిమెంట్ సీన్ అనేది కచ్చితంగా ఉంటుంది.
టాలీవుడ్ లో ఇప్పుడున్న కొంతమంది దర్శకులు తమ సినిమాలలో కచ్చితంగా ఒక సెంటిమెంటును ఫాలో అవుతున్నారు.
అందులో రాజమౌళి( Rajamouli ) ఒకరని చెప్పాలి.
ఈయన చేసే ప్రతి సినిమాలో ఒక పాత్ర కచ్చితంగా రిపీట్ అవుతుంది.ఇక ఆ పాత్ర ఉంటేనే ఆయన సినిమాలు హిట్ అవుతాయని ఒక నమ్మకం.
మామూలుగా ఈయన చేసే సినిమాలన్నీ మంచి కంటెంట్ తో వస్తాయి.సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్న కూడా మంచి కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తాడు.
ఇక ఆయన చేసే సినిమాలలో ఒక సెంటిమెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది.
బాహుబలి సినిమాతో ఇక ఆ మధ్యనే విడుదలైన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో ఈయన క్రేజ్ ఏకంగా గ్లోబల్ లెవెల్ లో దూసుకుపోతుంది.
కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషకు చెందిన ప్రేక్షకులు కూడా ఈయన సినిమాలకు ఫిదా అవుతున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే.రాజమౌళి చేసిన సినిమాలలో రిపీట్ అయ్యే ఒక సీన్ ఉంటుంది.ఇంతకు ఆ సీన్ ఏంటంటే విలన్ తో కామాంధుడు క్యారెక్టర్ చేయించడం.
ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలలో అటువంటి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టూడెంట్ నెంబర్ వన్:
ఇక ఈ సినిమాలో కూడా విలన్ కు ఉన్న కామం వల్ల హీరో లైఫ్ టర్న్ అవుతుంది.
సింహాద్రి:
ఈ సినిమాలో విలన్ కామాంధుడుగా ప్రవర్తించడం వల్ల హీరో అక్క చనిపోతుంది.ఇక ఆమె చనిపోవడం వల్ల సింహాద్రి ( Simhadri ) కాస్త సింగమలైగా మారుతాడు.
విక్రమార్కుడు:
ఇక ఈ సినిమాలో కూడా విలన్ కామాంధుడిగా ప్రవర్తిస్తాడు.ఇక ఆ కామాంధుడు చేసిన పని వల్ల విక్రమ్ రాథోడ్ లైఫ్ మొత్తం మారిపోతుంది.ఇక చివరికి విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ కూడా చనిపోతుంది.
మగధీర:
మగధీర ( Magadheera ) సినిమాలో కూడా విలన్ కామాంధుడుగా ఉంటాడు.మొదటి జన్మలో తన కోరిక తీరలేదని మళ్లీ రెండో జన్మలో కూడా హీరోయిన్ కోసం వస్తాడు.
ఈగ:
ఇక ఈ సినిమాలో కూడా విలన్ ను కామాంధుడుగా చూపించాడు జక్కన్న.ఇందులో విలన్ కు ఉన్న కామం వల్ల హీరో చనిపోయి ఈగగా పుడతాడు.
ఇక ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఇక ఈయన మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా ఆ సినిమాలో కూడా ఇటువంటి పాత్రను పెడతాడో లేదో చూడాలి.