ప్రయాణికులను ఫ్రీగా తీసుకెళుతున్న ఆటో డ్రైవర్.. కానీ ఆ ఒక్క కండిషన్ ఉంటుందట..

సాధారణంగా పేదవారు మంచి విద్యను పొందలేరు.చివరికి వారు ఏదో ఒక పనికి వెళ్తుంటారు.

 An Auto Driver Who Takes Passengers For Free But There Is Only One Condition , A-TeluguStop.com

వారిలో కొందరు ఆటో డ్రైవర్లుగా అవతారం ఎత్తుతారు.వీరందరూ రోజంతా కష్టపడుతూ డబ్బులు సంపాదించుకొని తమ జీవనం సాగిస్తుంటారు.

అయితే ఒక ఆటో డ్రైవర్( Auto driver ) మాత్రం ప్రయాణికులను ఫ్రీగా తీసుకుంటున్నాడు.అంతేకాదు ఎంత దూరం నుంచి అయినా ప్యాసింజర్లను ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు.

ఈ రోజుల్లో డీజిల్ ధరలు ఎలా భగ్గుమంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి పరిస్థితులలో అతడు ఫ్రీగా ఎలా సేవలను అందిస్తున్నాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ మలయాళం సినిమా ‘ది కేరళ స్టోరీ’( The Kerala Story ) చూసి బాగా ఫిదా అయ్యాడు.ఈ సినిమాలో లవ్ జిహాదీ కాన్సెప్ట్ గురించి చూపించారు.

ముస్లింమేతర అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వారి మనసు మార్చి ముస్లిం మతంలోకి మార్చడమే ఈ లవ్ జిహాదీ( Love Jihadi ).ఇందులోకి మార్చిన తర్వాత ఐసీస్‌లో జాయిన్ చేయడానికి కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఈ సినిమా డైరెక్టర్ సుదీప్తో సేన్.ఈ సినిమా చూసే ప్రేక్షకులనే ఆటో డ్రైవర్ ఫ్రీ గా థియేటర్లకు తీసుకెళ్లనున్నాడు.ఇది మే 5న అంటే ఈరోజు రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాకి వెళ్లే ప్రేక్షకులకు ఫ్రీ రైడ్ అందించడమే కాకుండా పదిమంది మహిళలకు( women ) ఫ్రీగా టికెట్లు కూడా కొనిస్తానని ఈ ఆటో డ్రైవర్ చెబుతుండటం విశేషం.ది కేరళ స్టోరీ సినిమా చూసే వారికి రైడ్స్ ఫ్రీ అని ఈ డ్రైవర్ తన ఆటో వెనుక రాయించాడు కూడా.ట్విట్టర్ యూజర్ షీతల్ చోప్రా ఈ ఆటో డ్రైవర్‌తో పాటు అతడి వాహనం వెనకవైపు ఉన్న బ్యానర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ సంగతి వెలుగులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube