ప్రస్తుతం ప్రజలు సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షల్లో డబ్బులను కోల్పోతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో సోషల్ మీడియా, పోలీసులు ఎంతగా అవగహన కలిగిస్తున్న జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే మరో మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి లక్షల్లో డబ్బులను కోల్పోయిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
రాచకొండకు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ విన్ బిజ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని వాట్సప్ మెస్సేజ్ అది హాంకాంగ్ నెంబరు నుండి పంపించారట కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.దీంతో ఆ నేరగాళ్లను గుడ్డిగా నమ్మిన మహిళను ముందుగా రూ.500 లతో రీచార్జ్ చేయమని చెప్పారట.
ఇలా మోసగాళ్లు చెప్పిన ప్రకారంగా.అదే యాప్ నుంచి రీచార్జ్ చేయడంతో పాటుగా తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి 2021 ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకూ పలు విడతలుగా దాదాపు రూ.20 లక్షలను ఆన్ లైన్ ట్రేడింగ్ పెట్టిందట ఆ మహిళ.
ఆ తర్వాత బ్యాలన్స్ చెక్ చేయగా రూ.54.39 లక్షల రూపాయలు విన్ బిజ్ యాప్ లో చూపించిందట.అయితే ఆ మొత్తాన్ని డ్రా చేద్దామనుకున్న ఆ మహిళకు విత్ డ్రాయల్ ఆప్షన్ బ్లాక్ అయినట్టుగా చూపించడంతో బాధితురాలు మోసపోయినట్టుగా గ్రహించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అశోక్ కుమార్, కంచి సంజీవ్ కుమార్, అసిమ్ అక్తర్ అనే నిందితులు అరెస్టు చేశారు.కాగా ఇలాంటి మరో 15 ఫేక్ కంపెనీలను గుర్తించి సీజ్ చేశారట.