ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ ఫీవర్ పట్టుకుంది.అభిమానం ముందు ఏదైనా దిగదుడుపు అన్నట్లు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో అసలు కరోనా ఉందా అనే విధంగా ఉంది పరిస్థితి ఉంది.
అందుకు కారణం వకీల్ సాబ్ సినిమా విడుదల కావడమే.మూడున్నరేళ్లుగా నిరీక్షిస్తున్న పవన్ అభిమానులకు ఓ పండగలా పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వకీల్ సాబ్ కు ముందు ఏవైతే ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవో ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
విడుదలైన అన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ షో లతో బ్లాక్ బస్టర్ సినిమా దిశగా దూసుకెళ్తోంది.
అయితే వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ రంగు పులుముకుంది.
సినిమా విడుదలకు మొదటి రోజు బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా, అదే విధంగా టికెట్ రేట్లను పెంచితే ఆయా థియేటర్ యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించిన నేపథ్యంలో థియేటర్ యజమానులు,డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఒక్కటై హైకోర్టుకు వెళ్లారు.కోర్టు అందుకు అనుమతివ్వడంతో వివాదం సర్డుమనిగింది.
అయితే బెన్ ఫిట్ షో కలెక్షన్లను ఖాతాలో వేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉంది.ఎందుకంటే బెన్ఫిట్ షో టికెట్స్ రేటు పెంపుకు అనుమతివ్వకపోవడంతో రేట్లు, పెరగనట్టు భావిస్తున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా ఎవరికీ చెప్పవద్దని ఎగ్జిబ్యూటర్స్ కు దిల్ రాజు ఆదేశాలు జారీ చేశాడని ప్రచారం నడుస్తోంది.