ప్రతి ఒక్కరు తమ జీవితంలో తమకు నచ్చిన రంగంలో స్థిర పడాలని అనుకుంటారు.కాని కొంత మందికే అలా జరుగుతుంది.
చాలా మంది తమకు నచ్చిన ఉద్యోగం దొరకక ఏదో ఒక రంగంలో సెటిల్ అయిపోతారు.ఇక కాంప్రమైజ్ అవుకుంటూ అలా జీవితాన్ని కొనసాగిస్తారు.
మనం అనుకున్నట్టు ఏదీ జరగదు.విధి ఏమనుకుంటే అది జరుగుతుంది అనేది మనకు చాలా సార్లు రుజువైంది.
ఈ విషయంలో సెలెబ్రెటీలు ఏమీ అతీతులు కారు.ఏదో రంగంలో స్థిర పడాలని అనుకొని యాక్టర్ లు అయిన వారు చాలా మంది నటులు మనకు కనిపిస్తారు.
మేము ఒకటి కావాలనుకున్నాం.నటులమయ్యాం అని చాలా మంది నటులు ఆయా సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బహిరంగంగా చెప్పిన విషయమే ఇది.అయితే రష్మిక కూడా ఈ విషయాన్ని బయట పెట్టింది.
రష్మికకు మొదట్లో టీచర్ అవాలని ఉండేదట.
అందుకే సైకాలజీ, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసిందట.కాని విధి నన్ను నటనా రంగం వైపు తీసుకొచ్చిందని రష్మిక చెప్పుకొచ్చింది.
లేకపోతే రష్మిక వాళ్ళ నాన్న వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట.ప్రస్తుతం రష్మిక గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బిగ్ బీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఆ సినిమా సూపర్ హిట్ అయితే రష్మిక ఇక బాలీవుడ్ లో సెటిల్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.