ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియా విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.దేసప్రజల్లో చాలా వరకు ఈ కోవిడ్ టీకా ఇప్పించుకుంటున్నారు.
కాగా వ్యాక్సిన్ ప్రారంభం అయిన కొత్తలో భయపడిన ప్రజలు ప్రస్తుత పరిస్దితుల్లో ఆ భయాన్ని పక్కన పెట్టి వ్యాక్సిన్ తీసుకోవడంలో సహకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా కొవిడ్ టీకా డోస్ ల పంపిణీలో ఇండియా వరల్డ్ రికార్డ్ సాధించిదట.
ఇండియాలో కొవిడ్ టీకా డోస్ ల పంపిణీ 10 కోట్ల మార్క్ ను అధిగమించిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కేవలం 85 రోజుల్లోనే 10 కోట్ల డోస్ లను ప్రజలకు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇకపోతే 10 కోట్ల డోస్ లను ఇవ్వడానికి అమెరికాకు 89 రోజులు పట్తగా, చైనాకు 102 రోజుల సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు ఇండియాను కొవిడ్-19 రహితంగా చేసే క్రమంలో ఓ మైలురాయిని అధిగమించాం.
కరోనాపై పోరాటంలో మరో అడుగు పడిందని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రధాని కార్యాలయం నుండి ట్వీట్ చేస్తూ అత్యంత వేగంగా ఈ మైలురాయిని ఇండియా అధిగమించిందని పేర్కొంది.