నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.చిట్యాల మండలం వట్టమర్తిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కావడంతో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.