టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.తెలంగాణకు కేసీఆర్ కు పేగుబంధం లేదని చెప్పారు.
పరోక్షంగా రెండు రాష్ట్రాలను కలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని విమర్శించారు.
తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే టీఆర్ఎస్ పేరు మారుస్తున్నారన్న రేవంత్ రెడ్డి ఇది తెలంగాణకు బ్లాక్ డే అని తెలిపారు.బీఆర్ఎస్ పేరుపై అభ్యంతరం చెప్పడానికి ఢిల్లీకి వెళ్లానన్నారు.
ఢిల్లీలో ఐదు రోజులున్నా ఈసీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు.ఈ క్రమంలోనే తన అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.