గతంలో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )చాలాసార్లు తనకు ఎండు చేపల కూర అంటే చాలా ఇష్టం అన్న విషయాన్ని తెలిపారు.అంతేకాకుండా స్వయంగా చిరంజీవి ఎండు చేపల కూరని వండుతారట.
చిరుకి మాత్రమే కాకుండా తనయుడు రామ్ చరణ్( Ram Charan ) కూడా ఆ రెసిపీ అంటే చాలా ఇష్టం.సంగతి అటు ఉంచితే అనుష్క,నవీన్ పొలిశెట్టి( Anushka , Naveen Polishetty ) నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు.
ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో నటించిన అనుష్క.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ పేరుతో చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా తనకు ఇష్టమైన వంటకాలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోసె రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.తనకు ఇష్టమైన రెండు వంటకాల గురించి వెల్లడించిన అనుష్క ఈ ఛాలెంజ్‌ను తరవాత రెబల్ స్టార్ ప్రభాస్‌కు ( Rebel Star Prabhas )విసిరారు స్వీటి.ప్రభాస్ ఎంత పెద్ద భోజన ప్రియుడో అందరికీ తెలిసిందే.ఈయన కూడా మాంసాహారి.ఇక అనుష్క విసిరిన రెసిపీ ఛాలెంజ్ స్వీకరించిన ప్రభాస్ తనకు ఇష్టమైన రొయ్యల పలావు ఎలా తయారు చేయాలో సోషల్ మీడియా ద్వారా వివరించారు.
ఎంతోకాలంగా అనుష్కతో తనకు పరిచయం ఉన్నా ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసిందని ప్రభాస్ తన పోస్ట్‌లో తెలిపారు.ఇక ఈ ఛాలెంజ్‌ను ప్రభాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు విసిరారు.ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రామ్ చరణ్( ram charan ).తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.ఆ చేపల పులుసు ఎలా తయారుచేయాలో కూడా వివరించారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరాలను పంచుకున్నారు.తరవాత ఈ ఛాలెంజ్‌ను రానా దగ్గుబాటికి విసిరారు.
ఇకపోతే నవీన్ పొలిశెట్టి అనుష్క కలిసి నటించిన ఈ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.