రష్యా – ఉక్రెయిన్( Russia – Ukraine ) యుద్ధం స్టార్ట్ అయ్యి ఏడాది దాటిపోయింది.త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కూడా.
దాదాపుగా 18నెలలుగా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు.ఆ ధాటికి వారు నస్టపోతున్నారు, అటుంచి వారి వలన ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోవడం జరిగింది.
వాస్తవానికి రష్యా వద్దనుండి ఆయిల్, డీజిల్, గ్యాస్ చాలా దేశాలు కొంటూ ఉంటాయి.అయితే ఈ యుద్ధం కారణంగా ఈ కొనుగోళ్లపై ఆంక్షలు విధించాయి నాటో దేశాలు.
కొంత మంది జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రష్యా వద్ద నుండి ఈ ఆయిల్, డీజిల్, గ్యాస్ అనేవి కొంటూ ఉన్నారు, అది వేరే విషయం.అందులో మన ఇండియా కూడా వుంది.

ఇకపోతే, యూరోపియన్ యూనియన్( European Union ) కి సంబంధించిన దేశాలైతే ఈ ఆంక్షలుకు లోబడి రష్యా వద్ద నుండి వీటిని కొనడం లేదని అనుకున్నారు మొన్నటి వరకు.అయితే ఇపుడు అందులో నిజం లేదని తేటతెల్లం అయిపోయింది.దానికి నిదర్శనమే యూరోపియన్ యూనియన్ తమ సభ్యత్వ దేశాలకు ఇచ్చిన వార్నింగ్ అని మనం అర్ధం చేసుకోవచ్చు.మనం అందరూ మాట్లాడుకుని పెట్టుకున్న ఆంక్షలు మనమే పాటించడం లేదు అని ఈయు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది.
ఈ ఏడాది ఈయూ దేశాలు అన్ని కలిపి కొన్న వాటిలో సగానికి పైగా రష్యా నుండే కొన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పెట్రోల్ గాని, గ్యాస్ గాని, డీజిల్ గాని 52శాతం వరకు రష్యా వద్ద నుండే ఈయూ దేశాలు కొన్నాయి అని తెలుస్తుంది.అరబ్ దేశాలు కూడా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేవి అమ్ముతూ ఉంటాయి.అయితే వాటి దగ్గర ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కాస్త ఎక్కువ వుంటుందని వినికిడి.
అయినా అవి అన్ని దేశాలకు సప్లై చేసే అంత కెపాసిటీని కలిగి ఉండవు.అందుకే రష్యాపై ఆధారపడి అన్ని దేశాలు బ్రతుకుతున్నాయి.
ఇప్పుడైతే ఈయు తన సభ్యత్వ దేశాలను రష్యా వద్ద నుండి కొనవద్దని హెచ్చరిక జారీ చేసిందట.