తెలుగు చిత్ర పరిశ్రమలోకి కెరటం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth singh ) ఒకరు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈమెకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేసే అవకాశం వచ్చింది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అందరితో కలిసి ఈమె జతకట్టారు.కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరు సరసన నటించారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరు సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని ( Jacky Bhagnani ) అనే వ్యక్తి ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈమె తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు.
ఇలా ప్రేమలో విహరిస్తూ ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు ఈ నెల 21వ తేదీ గోవాలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇలా గోవాలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జాకీ రకుల్ వివాహం జరగబోతుంది నిజానికి వీరి వివాహం మాల్దీవ్స్ లో జరగాల్సి ఉండగా మోడీ నిర్ణయంతో గోవాలో జరుగుతుంది.ఇలా ఈమె పెళ్లి మరికొద్ది రోజులలో ఉన్న నేపథ్యంలో ఈమె ప్రస్తుతం పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.రకుల్ తన ప్రియుడితో కలిసి తన పెళ్లి ఏర్పాట్లను చేయిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఇక ఈ పెళ్లి పనులలో భాగంగా ఈమె ముంబై వీధులలో విహరిస్తూ ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ముంబై వీధులలో ఆటోలో ప్రయాణిస్తూ చక్కర్లు కొట్టారు.ఈ వీడియోలో ఈమె పసుపు రంగు పొట్టి గౌను ధరించి ముఖానికి మాస్క్ వేసుకొని థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ రచ్చ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇలా రకుల్ ఆటోలో ప్రయాణిస్తూ తన పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.అయితే ఈమెకు ఎంతో విలాసవంతమైన లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఇలా ఆటోలో పెళ్లి పనులు చేసుకుంటూ మరోలా చిల్ అవుతున్నారని చెప్పాలి.
మొత్తానికి కాబోయే పెళ్లికూతురు పెళ్లి పనులలో తెగ హడావిడి చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.