తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం చెలరేగింది.ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆపిల్ సంస్థ నుంచి మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆరోపించిన విషయం తెలిసిందే.అదేవిధంగా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, అందరూ ఐఫోన్లు వాడాలని గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్నారని ఆరోపించారు.తాజాగా తన ఐఫోన్ ను హ్యాక్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు సమాచారం.
ఈ మేరకు ఆపిల్ సంస్థ తనను హెచ్చరించిందన్నారు.దీంతో రాష్ట్రంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.