దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురే లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్నా, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పరవాలేదు అనుకున్నా.ఏపీలో మాత్రం బిజెపి ఉన్నా లేనట్టుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది, పేరుకు పార్టీ ఉన్నా , పెద్దగా క్యాడర్ లేకపోవడం, ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోను బిజెపి ప్రభావం పెద్దగా కనిపించకపోవడం వంటివన్నీ ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
ఏపీ అధికార పార్టీ వైసీపీ కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన వంటివి బిజెపిపై విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు. ఏపీ కి కేంద్రం అనేక విషయాల్లో అన్యాయం చేసిందనే అభిప్రాయాలు ఆయా పార్టీల్లోనూ ఉన్నా పల్లెత్తు మాట బిజెపిని అనే పరిస్థితిలో ఏ పార్టీలు లేవు.
అధికార పార్టీ వైసిపి బిజెపి కేంద్ర ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ, అవసరమైన సందర్భంలో కేంద్రానికి మద్దతు ఇస్తూ వస్తోంది .
![Telugu Ap Bjp, Ap, Jagan, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics Telugu Ap Bjp, Ap, Jagan, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Jagan-ysrcp-ap-government-CBN-Pavan-Kalyan-AP-elections-janasena-alliance.jpg)
బిజెపి అగ్ర నేతల దృష్టిలో పడేందుకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP cm Jagan )ప్రయత్నిస్తూనే వస్తున్నారు.ఇక ఏపీలో బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న జనసేన సైతం బిజెపి విషయంలో ఏం అనలేని పరిస్థితిలో ఉంది .బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా, జనసేన పొత్తు కొనసాగిస్తోంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో చేలకుండా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్దామని , టిడిపిని కలుపుకు వెళ్దామని పవన్ ప్రతిపాదిస్తున్నా బిజెపి అగ్ర నేతలు మాత్రం టిడిపి తో పొత్తుకు నిరాకరిస్తున్నారు.అయినా బిజెపిని కలుపుకు వెళ్లాలనే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్( Chandrababu Pawan Kalyan ) ద్వారా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి సైతం బిజెపి తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది.విమర్శలను తేలిగ్గా తీసుకుంటూ కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండేలా చూసుకుంటుంది.
అయితే ఏపీలో బిజెపి ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుని పోటీ చేసినా, లేదా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళినా ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అయినా, ఎందుకు ఇంతగా అన్ని పార్టీలు బిజెపికి ప్రాధాన్యం ఇస్తున్నాయనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.
![Telugu Ap Bjp, Ap, Jagan, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics Telugu Ap Bjp, Ap, Jagan, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Ap-BJP-Jagan-ysrcp-ap-government-CBN-Pavan-Kalyan-AP-elections-TDP-janasena-alliance.jpg)
కేంద్రంలో బిజెపి( BJP ) అధికారంలో ఉండడం, వచ్చే ఎన్నికల్లోను బిజెపి కేంద్రంలో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే నివేదికలు బయటకు రావడం వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఏపీ రాజకీయ పార్టీలు బిజెపి పై భయం ,భక్తిని ప్రదర్శిస్తున్నాయనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి.