నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది.గత నెల 26న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో తన చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయింది.
అయితే తూటా స్టేషన్ పైకప్పుకు తగలడంతో ప్రాణనష్టం తప్పింది.అధికారుల వద్ద విషయాన్ని దాచిపెట్టిన ఎస్సై పేలిన తూటా స్థానంలో కొత్త బుల్లెట్ తెచ్చి ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఎస్సై తీరుపై ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అనంతరం ఘటనపై విచారణ జరిపిన అధికారులు నిజమని తేలడంతో ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు.