అమిగోస్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ రాజేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా అమిగోస్.నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.ఎస్ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించగా.జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

 Nandamuri Kalyan Ram Ashika Ranganath Amigos Movie Review And Rating Details, Am-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇదే కాకుండా నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ కాబట్టి నందమూరి అభిమానులతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తాడు.ఇక ఆ పాత్రలు ఏంటంటే.సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్ గా.మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా మైకేల్‌ అనే గ్యాంగ్ స్టర్‌ గా కనిపిస్తాడు.ఇక ఈ మూడు పాత్రలతో జరిగే సంఘటనల ద్వారా కథ మొత్తం నడుస్తుంది. 

Telugu Amigos, Amigos Story, Amigos Review, Brahmaji, Rajendra Reddy, Kalyan Ram

అయితే వీరు ముగ్గురు ఒకేలా ఉన్నా కూడా ఎటువంటి రక్తసంబంధం ఉండదు.అయితే ఇందులో మైకేల్ ఎన్ఐఏ బృందానికి దొరకకుండా వారికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు.ఇక అమాయకులైన సిద్ధార్థ్,  మంజునాథ్ లను వాడుకొని తనను తాను కాపాడుకుంటాడు.

ఇక చివరికి వారిద్దరికీ ఏం జరుగుతుంది.మైకేల్ ఆ బృందానికి దొరుకుతాడా లేదా   అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో అద్భుతంగా నటించాడు.హీరోయిన్ ఆశికా కూడా బాగా నటించింది.

బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులుతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Telugu Amigos, Amigos Story, Amigos Review, Brahmaji, Rajendra Reddy, Kalyan Ram

టెక్నికల్:

ఈ సినిమాకు డైరెక్టర్ మంచి కథను ఎంచుకున్నాడు కానీ అది చూపించడంలో కాస్త విఫలమయ్యాడు.సౌందర్ రాజన్ అందించిన  సినిమాటోగ్రఫీ పరవాలేదు.పాటలు కూడా అంతంత గానే ఉన్నాయి.ఇక మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

విశ్లేషణ:

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథను డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.కథలో లీనమయ్యే విధంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిచోట్ల విసుగు తెప్పించే విధంగా ఉంది.ఇంటర్వెల్ ట్విస్టు మాత్రం అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.

Telugu Amigos, Amigos Story, Amigos Review, Brahmaji, Rajendra Reddy, Kalyan Ram

ప్లస్ పాయింట్స్:

కళ్యాణ్ రామ్ నటన, ఇంటర్వెల్ ట్విస్ట్.

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ, బోరింగ్ లవ్ ట్రాక్, కొన్ని సన్నివేశాలు సరిగా పండలేదు.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ కథ.ఒకసారి చూస్తే సరిపోతుంది అన్నట్లుగా ఉంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube