బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన వీరసింహారెడ్డి నెగిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.అయితే క్రాక్ సినిమాను గోపీచంద్ మలినేని బాలయ్యతో తీయాలని ప్రయత్నించారనే విషయం మాత్రం చాలామంది ఫ్యాన్స్ కు తెలియదు.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నేను నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందని కానీ కుదరలేదని ఆయన తెలిపారు.బాలయ్య గోపీచంద్ కాంబోను ఫిక్స్ చేయాలని నేను అనుకున్నానని అయితే ఆ కాంబోలో సినిమా తీసే అవకాశం మరో బ్యానర్ కు దక్కిందని సి.కళ్యాణ్ కామెంట్లు చేశారు.బాలయ్యతో క్రాక్ కథ చేయాలని అనుకున్నామని అయితే బాలయ్య డేట్లు కుదరలేదని సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

బాలయ్య ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యం కాలేదని ఆయన కామెంట్ చేశారు.క్రాక్ మూవీలో బాలయ్య నటించి ఉంటే మాత్రం ఈ సినిమా బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచి ఉండేదని చెప్పవచ్చు.వరుస ఫ్లాపులతో ఢీలా పడిన రవితేజకు సైతం క్రాక్ సినిమాతో కోరుకున్న సక్సెస్ దక్కింది.
ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది.

చాలామంది హీరోలు రిజెక్ట్ చేసిన కథలతోనే రవితేజ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా బాలయ్య రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఈ కాంబోను సెట్ చేసే డైరెక్టర్ ఎవరో చూడాల్సి ఉంది.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కొత్త తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.







