వింత శబ్దాలతో హడలి పోయిన బెంగళూరు.. దీనికి కారణం !

ఒక్కొక్కసారి మనం వింటున్నవి అస్సలు నమ్మలేము.అలా ఎందుకు వింటున్నామో కూడా తెలియదు.

 Mysterious Loud Sound In Bengaluru, Bangalore News, Boom Sound, Bengaluru City,-TeluguStop.com

అలా ఎందుకు వస్తాయి.దీనికి కారణం ఏమిటి.

అని రకరకాల కారణాలు మనల్ని వేధిస్తుంటాయి.అలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉంటాయి.

తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.వింత వింత శబ్దాలతో బెంగుళూరు వాసులు హడలి పోయారు.

భూమి లో నుండి ఇలాంటి శబ్దాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు.బెంగుళూరు పచ్చని ప్రకృతితో ఎప్పుడు కళకళ లాడుతూ ఉంటుంది.ఎవ్వరినైనా యిట్టె ఆకట్టుకునే అందం బెంగుళూరుకు సొంతం.అలాంటి అందమైన సిటీలో శుక్రవారం రోజు భూమి నుండి భారీ శబ్దాలు రావడంతో ప్రజలందరూ భయపడ్డారు.

భూమ్ అంటూ గట్టి గట్టిగ శబ్దాలు వచ్చాయి.

అలా ఒక చోట మాత్రమే కాదు.బెంగుళూరు నగరంలో పలు చోట్ల ఇదే శబ్దాలు వినిపించాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చించు కుంటున్నారు.

మీ దగ్గర శబ్దాలు వచ్చాయా.అంటూ అందరిని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు.

గంటన్నర పాటు ఇలా శబ్దాలు రావడంతో భూకంపం వచ్చిందేమో అని ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.

ఈ విషయంపై అందరు స్పందించారు.వాతావరణ శాఖ ఈ విషయంపై భయపడొద్దు అని ప్రజలకు తెలిపారు.అయితే అధికారులు భూకంపం రాలేదని స్పష్టం చేసారు.

HAL కూడా స్పందించి తాము ఎలాంటి శబ్దాలు చెయ్యలేదని తెలిపారు.ఇలా ఎందుకు శబ్దాలు వచ్చాయో ఎవ్వరికి అర్ధం కాలేదు.

ఇంతకు ముందు హైదరాబాద్ లో వర్షాల కారణంగా భూమిలోపలకి వర్షం నీరు బలవంతంగా వెళ్ళేటప్పుడు టప్ అనే శబ్దాలు వచ్చాయని సైన్టిస్టులు అప్పుడు తెలిపారు.కానీ ఇప్పుడు బెంగుళూరులో భూమ్ అనే శబ్దం ఎందుకు వచ్చిందో ఇంకా ఎవ్వరికి అర్ధం కానీ ప్రశ్న.

https://twitter.com/dp_satish/status/1410771959005081600/photo/1
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube