శ్రీరామనవమి( Srirama Navami ) సందర్భంగా ఎటు చూసినా టాలీవుడ్ లో కూడా ఆయన జపమే నడుస్తుంది.ఎక్కడ చూసినా అయోధ్య( Ayodhya ) లేదా రాముడి గురించి చర్చ కొనసాగుతుంది.
ఇదే అదనుగా భావించి అనేక సినిమాలు ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వీటి సందడి ఎక్కువైంది.
అయోధ్య నిర్మాణం తర్వాత ఈ హడావిడి ఎక్కువ అవ్వడం విశేషం.మరి ప్రస్తుతం అయోధ్య లేదా రాముడు జీవితం గురించి కొన్ని సినిమాలు ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి.
వాటి గురించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Akshay Kumar, Ayodhya Sriram, Jai Hanuman, Journey Ayodhya, Kangana Ranau Telugu Akshay Kumar, Ayodhya Sriram, Jai Hanuman, Journey Ayodhya, Kangana Ranau](https://telugustop.com/wp-content/uploads/2024/04/Movies-are-coming-on-Ayodhya-sriram-details-ramayanam-jai-hanuman-journey-to-ayodhya-detailsd.jpg)
శ్రీరాముని జీవితం పై నార్త్ లో ప్రస్తుతం ఒక కథ సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలుసిందే.రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి సీతగా యశ్ రావణుడిగా ఒక రామాయణం( Ramayanam Movie ) తెరకెక్కక బోతుంది.దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ రామాయణం గురించి చర్చ కొనసాగుతోంది.ఇక ఇప్పటికే హనుమాన్ సినిమా తేజ సజ్జ హీరోగా రావడం, అది ప్యాన్ ఇండియా వ్యాప్తంగా హిట్ అవ్వడం కూడా మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు దీనికి సీక్వల్ గా జై హనుమాన్( Jai Hanuman Movie ) అనే సినిమా కూడా తెరకెక్కుతుంది.దానికి సంబంధించిన పనులు కూడా ఈ సినిమా డైరెక్టర్ మొదలుపెట్టారు.
![Telugu Akshay Kumar, Ayodhya Sriram, Jai Hanuman, Journey Ayodhya, Kangana Ranau Telugu Akshay Kumar, Ayodhya Sriram, Jai Hanuman, Journey Ayodhya, Kangana Ranau](https://telugustop.com/wp-content/uploads/2024/04/Movies-are-coming-on-Ayodhya-sriram-details-ramayanam-jai-hanuman-journey-to-ayodhya-detailsa.jpg)
ఇక అక్షయ్ కుమార్( Akshay Kumar ) కూడా అతను ఒక సినిమా తీయబోతున్నట్టు అది రాముడి జీవితంలో ఒక ఘట్టాన్ని చూపించబోతున్నట్టుగా తెలిపారు.అలాగే అయోధ్య గుడి నిర్మాణం గురించి కూడా తన ఒక సినిమా చేయబోతున్నట్టు కంగనా రనౌత్( Kangana Ranaut ) ఇప్పటికే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.695 పేరుతో తన దగ్గర ఒక స్క్రిప్ట్ సిద్ధంగా ఉందంటూ బాలీవుడ్ నటుడు అరుణ్ గోయల్ ప్రకటించారు.ఇది పూర్తిగా అయోధ్య నేపథంలో తిరగకపోతుందట.
దర్శకుడు వేణు దోనపూడి సైతం జర్నీ టు అయోధ్య అనే ఒక సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.చిత్రాలయ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు VN ఆదిత్య కథ అందించారు.