ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేసేందే కాకుండా ఆ యువతికి కోడలు వరసయ్యే టువంటి ఓ మైనర్ బాలికను కూడా లొంగ దీసుకొని గర్భవతిని చేసిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే ముంబై ప్రాంతంలో అజ్మల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన బంధువులకు సంబంధించినటువంటి ఓ వేడుకకు హాజరయ్యాడు.
ఈ వేడుకలకు 23 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి మరియు 17 సంవత్సరాలు కలిగినటువంటి తన మేనకోడలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారితో అజ్మల్ పరిచయం పెంచుకున్నాడు.అయితే ఈ క్రమంలో అజ్మల్ తో ప్రేమలో పడింది.దీంతో ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒకటయ్యారు.ఆ సమయంలో అజ్మల్ ఆ యువతి నగ్న ఫోటోలను చిత్రీకరించాడు.
అనంతరం ఫొటోలతో బెదిరించ సాగాడు.అలాగే ఆ ఫోటోలను ఆ యువతి మేన కోడలేనటువంటి మైనర్ బాలికకు చూపించి తన కోరిక తీర్చాలని లేకపోతే తన అత్త నగ్న ఫోటోలను నెట్లో పెడతానని బెదిరించాడు.అయినా కూడా ఆ మైనర్ బాలిక లొంగక పోయేసరికి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.
అయితే ఆమె గర్భం దాల్చడానికి కారణమేంటని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు నిలదీయగా ఆ బాలిక తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలిపింది.విషయం తెలుసుకున్న టువంటి బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి అజ్మల్ పై ఫిర్యాదు నమోదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.అనంతరం కోర్టులో హాజరు పరచి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.