ప్రస్తుత కాలంలో మనుషులకే ప్రతీ చిన్న విషయానికి ఆత్మహత్య సమాధానంగా కనిపిస్తోంది.దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా కొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ తమను ప్రేమించే వారి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.
తాజాగా ఓ మహిళ తన భర్త వద్దన్నా వినకుండా మోటార్ సైకిల్ కొన్నాడని తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తన కుటుంబంతో మాండ్య ప్రాంతానికి చెందినటువంటి తబ్బిహళ్లి మండలంలో ఓ గ్రామంలో తన భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.అయితే గతకొద్దికాలంగా వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దాంతో పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండేవాడు.అయితే ఈ క్రమంలో అతడి భార్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది.
అయితే తాజాగా ఆ వ్యక్తి ఒక ఫైనాన్స్ కంపెనీలో అప్పు చేసి మరీ మోటార్ సైకిల్ వాహనాన్ని కొన్నాడు.దీంతో అసలే పనిలేకుండా ఇంటి దగ్గర ఉంటూ హెచ్చులకి పోయి ఇలాంటి ఖరీదైన వస్తువులు కొంటూ కుటుంబాన్ని అప్పులపాలు చేయడమేంటని నిలదీసింది.
ఈ విషయమై ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి.అయితే ఆ వ్యక్తి ఈ ఒక్క బైక్ విషయంలోనే కాకుండా బయట కూడా దుబారా ఖర్చులు చేస్తూ అందిన చోటల్లా అప్పులు చేస్తూ ఉండేవాడు.దీంతో అతడి చేష్టలతో విసిగిపోయిన అతడి భార్య మరియు ఇద్దరి పిల్లలను తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.ఇది గమనించిన టువంటి స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతిచెందింది.
అయితే పిల్లల మృతదేహాల ఆచూకీ మాత్రం లభించలేదు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి అదృశ్యమైన ఇటువంటి పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అలాగే మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.