ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన టువంటి దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి రామ్ పోతినేని తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు.అంతేగాక ఇటీవల కాలంలో రామ్ నటించినటువంటి ఇస్మార్ట్ శంకర్ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అయితే ఈ చిత్రం టాక్ పరంగానే కాకుండా దర్శక నిర్మాతలకు మంచి కాసుల వర్షం కురిపించింది.దీంతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన సత్తా ఏంటో తెలుగు సినీ పరిశ్రమకు చూపించాడు.
అయితే సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచినటువంటి వారికి జీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రధానం చేసేటువంటి అవార్డులకు రామ్ పోతినేని ఎన్నికయ్యాడు.అంతేగాక ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు గానూ సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అవార్డును కూడా దక్కించుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించేటువంటి జీ సినీ అవార్డ్స్ కి తను ఎంపికవ్వడం మరియు అవార్డును గెలుచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తనను ఎంతగానో ఆదరించిన తన అభిమానులకు ఎంతగానో రుణపడి ఉంటానని రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా రామ్ పోతినేని ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నరెడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు కిషోర్ తిరుమల సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.