అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరగగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోజు సెలవు దినంగా ప్రకటించాయి.కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవును ప్రకటించడం జరిగింది.
ప్రాణప్రతిష్ట రోజున చాలామంది ఇంటికే పరిమితమై శ్రీరాముడిని పూజించారు.అయితే ప్రాణప్రతిష్ట( Pranapratishta ) రోజున సెలవు కావాలని ఒక ఉద్యోగి సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా వేర్వేరు కారణాల వల్ల అతనికి సెలవును మంజూరు చేయలేదు.
అయితే రామునిపై భక్తి ఉన్న ఆ వ్యక్తి తనకు సెలవు మంజూరు చేయకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రివర్స్ లో షాకిచ్చాడు. గగన్ తివారీ( Gagan Tiwari ) అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను పంచుకున్నారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో తిలకించాలని భావించగా సెలవు ఇవ్వకపోవడం తనను ఎంతగానో బాధ పెట్టిందని ఆయన అన్నారు.అందుకే ఉద్యోగానికి రిజైన్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
గగన్ తివారీ పోస్ట్ గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అయితే ఎక్కువమంది మాత్రం గగన్ తివారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.రాముని అనుగ్రహంతో గగన్ తివారీకి త్వరలో మంచి ఉద్యోగం లభించాలని కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు అయోధ్య రాముడికి బాలక్ రామ్ అని పేరు పెట్టినట్టు పండితులు చెబుతున్నారు.
బాలక్ రామ్ మందిర్ ( Balak Ram Mandir )అని ఆలయాన్ని పిలుస్తామని పండితులు వెల్లడిస్తున్నారు.
దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా అయోధ్యకు ట్రైన్లు పెంచితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయోధ్యకు వెళ్లి బాలరాముడిని దర్శించుకోవాలని భావిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పరిమిత సంఖ్యలో ట్రైన్లు మాత్రమే అయోధ్యకు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.