ఆకలి మనుషులను ఎంతటి ఘాతుకానికి అయినా పాల్పడేలా చేస్తుందని పలు సందర్భాల్లో మనం వినే ఉంటాం.అయితే తాజాగా ఓ వ్యక్తి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన కుటుంబ పోషణ భారమై ముక్కుపచ్చలారని చిన్నారి కూతురుని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా మొత్తం ఉలిక్కిపడింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన పుల్కల్ మండలంలోని ఓ గ్రామంలో జీవన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.గత కొద్దికాలంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే తన కుటుంబ పోషణ భారం అవుతుందని ఆలోచించిన జీవన్ తన ముక్కు పచ్చలారని 4 ఏళ్ళు కలిగిన కూతురిని దారుణంగా హత్య చేశాడు.
ఈ విషయం గమనించినటువంటి స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి చిన్నారి మృతదేహాన్ని పంచనామా నిమిత్తమై దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుడిని విచారణ నిమిత్తమై జైలుకు తరలించారు.