అనుకున్న సమయానికే పెళ్లి చేసుకోవాలని సైకిల్ పై ఏకంగా... 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో ఓ యువకుడు అనుకున్న సమయానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునిఏకంగా దాదాపుగా 230 కిలోమీటర్ల పాటూ సైకిల్ పై ప్రయాణం చేసి అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Marriage News, Men Travelling By Cycle, Uttar Pradesh News, Lock Down, Marriage-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో లోని హమియాపూర్ జిల్లా చెందినటువంటి గ్రామంలో ప్రజాపతి అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.ఇటీవలే రాష్ట్రంలోని మరో జిల్లాకు చెందినటువంటి యువతితో ప్రజాపతికి వివాహం నిశ్చయమయింది.

కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లకు అనుమతి లేకపోవడంతో కొంతకాలం పాటు వివాహాన్ని వాయిదా వేయాలని యువకుడి తల్లిదండ్రులు నిశ్చయించుకున్నప్పటికీ ప్రజాపతి మాత్రం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలని యువతి నివాసానికి సైకిల్ పై ప్రయాణం చేసి వెళ్ళాడు.అంతేగాక వధువు తల్లిదండ్రులను ఒప్పించి అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం తిరిగి అదే సైకిల్ పై తన భార్యను తీసుకొని తన స్వగ్రామానికి చేరుకున్నాడు.అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు ప్రజాపతికి జీవితాంతం తన భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో సంతోషంగా గడపాలని అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube