కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థంగా తయారైంది.అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అభివృద్ది చెందిన దేశంతో పాటు అన్ని దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇండియా వంటి ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న దేశం అవ్వడంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థతో పాటు విద్యావ్యవస్థపై కూడా పెను ప్రభావం పడినది.
ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేందుకు చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు.
ఇక విద్యావ్యవస్థ విషయానికి వస్తే ఇండియాలో చాలా వరకు జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది.కాని ఈసారి అలా జరిగే పరిస్థితి కనపడటం లేదు.
జూన్ కాదుకదా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. స్కూల్స్ మాత్రమే కాకుండా కాలేజ్‌లు, యూనివర్శిటీలు ఇలా అన్ని కూడా కంప్లీట్‌గా మూతపడి ఉన్నాయి.
వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి అనే ప్రచారం కూడా జరుగుతోంది.