సినిమా పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుంటాయి.షూటింగ్ సమయంలో చేసిన చిన్న చిన్న తప్పులు ఒక్కోసారి పెద్ద ప్రమాదానికి కారణం అవుతాయి.
అటు పలుచోట్ల నిత్యం రోడ్డు ప్రమాదాలూ జరుగుతుంటాయి.ఆయన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సినీ నటులు చాలా మంది ఉన్నారు.
సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడిన హీరోలు కూడా చాలా మంది ఉన్నారు.అటు సినిమా షూటింగ్ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు జరిగి చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన హీరోలు కూడా ఉన్నారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే తాతకు తగ్గ మనువడు అనే పేరు కొట్టేశాడు.తాత మాదిరిగానే నటిస్తూ జనాల ఆదరణ పొందాడు.ఆయన హీరగా కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.క్యాంపెయిన్ ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆయన కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు.
శర్వానంద్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా రంగంలో అడుగు పెట్టి.హీరోగా మారిన నటుడు శర్వానంద్.ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశాడు.
ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమా అవకాశాలు పొందాడు.గమ్యం సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
అయితే 96 సినిమా షూటింగ్ సందర్భబంగా ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.ఈ సినిమా షూటింగ్ సమయంలో థాయ్ లాండ్ లో రెండు రోజుల పాటు స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఈ సమయంలో గాలి ఎక్కువ రావడంతో బలంగా కింద పడ్డాడు.తీవ్ర గాయాల పాలయ్యాడు.
సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ సినిమా తెరకెక్కింది.ఈ మూవీ షూటింగ్ కర్నూల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా పలు యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తతున్నారు.ఆ సమయంలో బాంబ్ బ్లాస్ జరిగింది.ఈ ప్రమాదంలో సందీప్ కిషన్ తీవ్రంగా గాయపడ్డాడు.ఆయన ఛాతీతో పాటు కుడి చేతిపై గాజు ముక్కలు దిగాయి.
వెంటనే తనను అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు.అటు అటు అశ్వద్ధామ సినిమా షూటింగ్ సమయంలో నాగ శౌర్య తీవ్రంగా గాయపడ్డారు.
అటు బెంగుళూరు నుండి ఇంటికి వస్తున్న సమయంలో వరుణ్ తేజ్ కారుకు యాక్సిడెంట్ అయ్యింది.ఈ ప్రమాదంతో ఆయన గాయపడ్డాడు.