టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు జారీ చేసింది.మాణిక్కం ఠాగూర్ వేసిన పరువు నష్టం దావాపై న్యాయస్థానం విచారణ జరిపింది.
ఇందులో భాగంగా ఇరువురికి నోటీసులు ఇచ్చింది.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.
నోటీసులు పంపింది.కౌశిక్ రెడ్డి తరపున ఎవరూ హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కోర్టు తెలిపింది.
కాగా మాణిక్కం ఠాగూర్ డబ్బులు తీసుకుని పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరువురిపై మాణిక్కం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు.