బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.అద్దంకిలోని గరటయ్య కాలనీ సమీపంలో కాకనికుంట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని యువతి, యువకుడు బలవన్మరణం చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు పెద్దిరాజు, ప్రశాంతిగా గుర్తించారు.ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో బలవన్మరణం చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.