టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు.అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్ అలాగే పౌరాణిక చిత్రాలతో ఆయన మంచి గుర్తింపుని అందుకొని తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు.
సినిమా బ్రతికున్నంత కాలం కూడా కృష్ణ గారిని గుర్తుపెట్టుకునేంత సరికొత్త టెక్నాలజీని ఆయన మొదట తెలుగు చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చారు.ఇక అలాంటి సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం గురించి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుర్రిపాలెం లో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ చదువుకునే రోజుల్లో నుంచి మంచి అందగాడిగా అందరి దృష్టిలో పడేవాడు.హీరోగా ట్రై చేయవచ్చు కదా అని చాలామంది చిన్నప్పటినుంచి అతనికి చెబుతూ ఉండేవారు.
ఇక ఆ తర్వాత సినిమాల మీద మక్కువతో 1965లో అతను ప్రయత్నాలు మొదలు పెట్టాడు.ఇక కృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అతనికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయిసూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో 350 కి పైగా సినిమాల్లో నటించాడు.
ఇక ఐదు దశాబ్దాల వరకు ఆయన ఎనలేని స్టార్ హోదా సొంతం చేసుకున్నారు.ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక కొత్త టెక్నాలజీ కూడా ఆయన ప్రవేశ పెడుతూ ఉండేవారు.
నిర్మాతగా ఆయన ఇండస్ట్రీలో ఎంతోమందికి ఉపాధిని కల్పించారు అని చెప్పాలి.

సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్ చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.ఇక తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం తన మొదటి సినిమా అని చెబుతూ ఉండేవారు.ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి సినిమా తేనె మనసులు 1965 లో విడుదల అయింది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ తనకు మొదటి అవకాశం వచ్చిన విషయాన్ని గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.తేనె మనసులు సినిమా ఆడిషన్స్ కోసం ఆ తర్వాత స్టార్స్ అయిన వారు కూడా ఆడిషన్స్ లో పాల్గొన్నారు అని అయితే ఆదర్తి సుబ్బారావు గారు నేను ఫోటోలు పంపించగానే హీరోగా ఫిక్స్ చేయాలని అనుకున్నారు.
వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన మొండి పట్టు వీడకుండా నన్నే హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు.అని కృష్ణ ఒకప్పుడు గుర్తు చేసుకున్నారు.

ఇక మొదటి సినిమాకు కృష్ణ గారికి వచ్చిన పారితోషికం 500 మాత్రమే అని ఒకప్పుడు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉండేవారు.అయితే ఆ విషయంపై కూడా కృష్ణ వివరణ ఇచ్చారు.తనకు తేనె మనసులు సినిమా ద్వారా వచ్చిన మొదటి రెమ్యునరేషన్ రూ.2000 అని చెప్పారు.అయితే అప్పట్లో అది చాలా పెద్ద రెమ్యూనరేషన్ అని కూడా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.అయితే ఇప్పట్లో ఒక సినిమా సక్సెస్ అయితే అందరూ కూడా కోట్ల రూపాయలలో వారి రెమ్యునేషన్స్ పెంచేస్తున్నారు.కానీ నేను మాత్రం దాదాపు 30 నుంచి 40 సినిమాల వరకు కూడా పారితోషికం రూ.5000 మాత్రమే తీసుకున్నాను అని కృష్ణ ఒకప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.అంతే కాకుండా విజయనిర్మల కూడా అదే ఇంటర్వ్యూలో కృష్ణ గురించి మాట్లాడుతూ.కృష్ణ గారు నిర్మాతల హీరో, నిర్మాతలు కష్టపడితే ఏమాత్రం తట్టుకోలేరు.వారు ఆర్థికంగా నష్టపోకూడదు అని చాలాసార్లు భారం పడకుండా చూసుకున్నట్లుగా.గుర్తుచేసుకున్నారు.







