తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు మరోసారి తెలంగాణకు రానున్న ప్రియాంక గాంధీ కొల్లాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించనున్న విజయభేరీ సభలో పాల్గొననున్నారు.అయితే ప్రియాంక గాంధీ ఎన్నికల పర్యటనలో తాజాగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ముందుగా కొల్లాపూర్ తో పాటు దేవరకద్రలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.అయితే ప్రియాంక దేవరకద్ర రావడం లేదని, కేవలం కొల్లాపూర్ విజయభేరీ సభలోనే పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కొల్లాపూర్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.సభ ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.