ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.కరుణగిరి సమీపంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు.
పాలేరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎంతో చేశారన్నారు.పాలేరు రిజర్వాయర్ ద్వారా 2.70 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని చెప్పారు.పాలేరులో కేసీఆర్ ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పాలన రావాలని తెలిపారు.రానున్న ఎన్నికల్లో తాను పాలేరు నుండే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.