సూర్యాపేట జిల్లాలో పోలీసులకు షాక్ తగిలింది.పోలీస్ ఇన్నోవా వాహనాన్ని ఓ కేటుగాడు ఎత్తుకెళ్లాడు.
సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారుజామున వాహనం చోరీ అయినట్లు తెలుస్తోంది.రోడ్డు పక్కన ఇన్నోవాను నిలిపిన పోలీసులు పనిపై పక్కకు వెళ్లారు.
కారుకే తాళం ఉండటాన్ని గమనించిన కంత్రీ వాహానాన్ని తీసుకుని ఊడాయించాడు.ఈ క్రమంలోనే కోదాడ వద్ద డీజిల్ అయిపోవడంతో వాహనాన్ని వదిలి పరారైయ్యాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేటుగాడి కోసం గాలిస్తున్నారు.