ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ క్లాస్ పేరిట పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంటున్న విషయం తెలిసిందే.ఆ క్లాస్లు వినడం ఏంటో గానీ, ఈ సెల్ ఫోన్ వల్ల చేయకూడని పనులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కొందరు పిల్లలు సరైన మార్గంలో ఫోన్ ఉపయోగించకుండా ఈ అవకాశాన్ని చట్టవ్యతిరేక పనులకు ఉపయోగిస్తున్నట్లుగా బయటపడింది.ప్రస్తుతం ఇలాగే ఓ పిల్లాడు అధికార పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు చూస్తే.
కరీంనగర్‌కు చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నందు వల్ల అతని తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం సెల్‌ఫోన్ కొనిస్తే చివరకు ఓ ప్రముఖ పార్టీ చేతికి చిక్కి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే స్థాయికి వెళ్లిపోయాడట.
అలా కొంతకాలానికి సొంతంగా యూట్యూట్ చానల్‌ను కూడా ఏర్పాటుచేసుకున్న ఆ బాలుడు మరింత రెచ్చిపోయి చివరకు పోలీసుల చేతికి చిక్కాడట.
ఈ క్రమంలో నిపుణులు, పోలీసులు ఈ అంశం పై మాట్లాడుతూ, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి రాజకీయ సైబర్ బూచాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోలేకమని సూచిస్తున్నారు.
కాబట్టి కరోనా తగ్గి, స్కూళ్లు మొదలైయ్యే వరకు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని వెల్లడిస్తున్నారు.