సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి వారి లవ్ ఎఫైర్స్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి.
అయితే ప్రస్తుతం బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) కూడా ఒకరు.ఈమె కూడా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా జాన్వీ మొదటిసారి తన ఫస్ట్ లవ్( First Love )గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే తన ప్రేమ గురించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.అయితే ఇప్పటికే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలతో రిలేషన్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా తన మొదటి ప్రేమ గురించి జాన్వీ మాట్లాడుతూ.
అప్పుడు మా ఇద్దరిలో పెద్దగా పరిణితి లేదు అందుకే అయోమయంలో పడ్డామని తెలిపారు.ఇక ఈ విషయం మా పెద్దలకు తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమని మాకు సలహా ఇచ్చారు.
పెద్దవారు చెప్పిన విధంగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది అని నిశ్చయించుకున్నటువంటి మేమిద్దరం మా మొదటి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నామని ఈ సందర్భంగా జాన్వీ కపుల్స్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె మొదట ఎవరిని లవ్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అక్షత్ రాజన్ ( Akshath Rajan ) అనే వ్యక్తితో లవ్ లో పడినట్లు సమాచారం.అతడే ఆమె ఫస్ట్ లవ్ కావచ్చు.అనంతరం జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ హీరో ఇషాన్ కట్టర్ తో కూడా సన్నిహితంగా ఉండడంతో ఆయనతో కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ ( NTR )హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో( Devara Movie )నటించే అవకాశాన్ని అందుకున్నారు.