ఆసియా కప్( Asia Cup ) టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యి సూపర్-4 దశ ప్రారంభం అవ్వనుంది.నేడు తొలి మ్యాచ్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం అవ్వనుంది.సూపర్-4 దశ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడైన నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎడమ కాలుకు గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడడం లేదు.ఇక వన్డే ఆసియా కప్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచులు జరిగితే అందులో పాకిస్తాన్ 12 మ్యాచ్లు గెలవగా.
బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది.ఆ గెలిచిన మ్యాచ్ కూడా 2018 ఆసియా కప్ లో జరిగింది.

నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఒత్తిడి కాస్త అధికంగా ఉండనుంది.జట్టులో ఆటగాళ్లయిన మెహాదీ హసన్ మిరాజ్, కెప్టెన్ షకిబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముస్ఫికర్ రహీమ్( Mushfiqur Rahim ) లపై బాధ్యత మరింత పెరిగింది.ఇక జట్టులో ఫాస్ట్ బౌలర్లు అనుకున్న విధంగానే రాణిస్తున్నారు.బంగ్లాదేశ్ బౌలర్లైన తస్కిన్ అహ్మద్, షోరీపుల్ ఇస్లాం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో తమ వంతు సపోర్ట్ ఇచ్చారు.

పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే అటు బ్యాటింగ్ లోను.ఇటు బౌలింగ్ లోను జట్టు చాలా బలంగా ఉంది.పాకిస్తాన్ బ్యాటర్లైన కెప్టెన్ బాబర్ అజాం( Babar Azam ), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇఫ్తికర్ అహ్మద్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.పాకిస్తాన్ బౌలర్లైన షాహిన్, హరీస్ రావుస్, నసీం షా ఈ ఆసియా కప్ మ్యాచ్లలో ఫుల్ ఫామ్ నే కొనసాగిస్తున్నారు.
బంగ్లాదేశ్ జట్టు అటు బౌలింగ్ లోను.ఇటు బ్యాటింగ్ లోను సమర్ధవంతంగా రాణిస్తేనే పాకిస్తాన్ పై గెలిచే అవకాశంఉంటుంది.అలా కాకుండా చిన్న పొరపాటు జరిగిన పాకిస్తాన్ విజయం సాధిస్తుంది.