ప్రస్తుతం బుల్లితెరలో ప్రతీ గురు, శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కామెడీ షోలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.అలాగే ఈ కామెడీ షోల ద్వారా పలువురు కమెడియన్స్ వెండితెరకి పరిచయమయ్యి బాగానే రాణిస్తున్నారు.
ఇందులో ఇప్పటికే షకలక శంకర్, చలాకి చంటి, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్,గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వాళ్ళు తెలుగు సినిమాల్లో సత్తా చాటుకున్నారు.అయితే తాజాగా చమ్మక్ చంద్ర స్కిట్ లో లేడీ గెటప్ వేసే వినోదిని అలియాస్ వినోద్ ఏకంగా బాలీవుడ్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు.
అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వినోద్ పాల్గొన్నాడు.అయితే ఇందులో భాగంగా తనకు బాలీవుడ్ లో పూనమ్ పాండే నటిస్తున్న ఓ చిత్రంలో తనకు నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు.అయితే ఆ సమయంలో తనపై జరిగిన దాడి కారణంగా తన నటించిన డేట్లు మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
అంతేగాక ఇప్పటికే తాను కొన్ని షూటింగ్ షెడ్యూలల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపాడు.
అయితే తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అంతేగాక లేడీ గెటప్ లో ఉన్న నన్ను కొంతమంది తమ సూటిపోటి మాటలతో వేధించేవారని, మరి కొందరైతే లైంగికంగా వేధించేవారని వినోద్ చెప్పుకొచ్చాడు.
.