బాంబులను పసిగట్టడంలో దిట్టలుగా పేరెన్నికగన్న స్నిఫర్ కుక్కలకు కేరాఫ్ అడ్రస్‌గా అమెరికా నిలుస్తున్న సంగతి తెలిసిదే.వీటి పనితీరు, చురుకుదనం దృష్ట్యా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అమెరికా నుంచి ఈ జాతి కుక్కలను కొనుగోలు చేస్తున్నాయి.
ఇదే సమయంలో జోర్డాన్, ఈజిప్టులకు పరస్పర సహకార ఒప్పందం ప్రకారం పంపిన స్నిఫర్ కుక్కలు సరైన సంరక్షణ లేక మరణిస్తుండటంతో అమెరికా ఆ రెండు దేశాలకు వీటి సరఫరాను నిలిపివేసింది.
జోర్డాన్, ఈజిప్టులలో కుక్కల మరణం చాలా విచారకరమని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు.
జోర్డాన్, ఈజిప్టులలో కుక్కుల సేవలను దుర్వినియోగం చేయడంతో పాటు వాటికి సరైన సంరక్షన అందడం లేదని ఇన్స్‌పెక్టర్ జనరల్ కార్యాలయానికి 2017 నుంచి నివేదికలు అందాయి.

సెప్టెంబర్‌లో అందిన తాజా నివేదిక ప్రకారం.బెల్జియం మాలినోయిస్, జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్ వంటి పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందిన 135 కుక్కల సంరక్షణలో ఆయా దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనుగొన్నారు.ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకారంలో భాగంగా అమెరికాలో శిక్షణ పొందిన ఈ కుక్కలను 12 దేశాలకు అందించారు.
ఈ కార్యక్రమంలో జోర్డాన్‌కు అమెరికా ప్రాధాన్యతనిచ్చింది.ఇక్కడ సరైన సంరక్షణ లేని కారణంగా మొదట ఓ కుక్క మరణించగా.
రెండోది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అమెరికాకు తిరిగి పంపారు.
ఇక ఈజిప్ట్ విషయానికి వస్తే ఇక్కడికి పంపిన 10 కుక్కలలో మూడు అకాల మరణానికి గురయ్యాయి.
ఒకదానికి ఊపిరితిత్తుల క్యాన్సర్, రెండవది పిత్తాశయ వ్యాధి, మూడవది అధిక వేడి బారినపడి మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఇక్కడ ఈజిప్ట్ అధికారుల నిర్లక్ష్యం, సరైన సంరక్షణ లేని కారణంగానే అవి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నివేదికలో తెలిపారు.
ఈ క్రమంలో ఇన్స్‌పెక్టర్ కార్యాలయ అధికారులు.జోర్డాన్, ఈజిప్టులకు స్నిఫర్ కుక్కల సరఫరాను నిలిపివేయాల్సిందిగా స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ డిప్లోమాటిక్ సెక్యూరిటీకి సిఫారసు చేసింది.
దీనిపై స్పందించిన అధికారులు స్నిఫర్ కుక్కల సరఫరాను ఈ రెండు దేశాలకుతాత్కాలికంగా నిలిపివేశారు.