అమెరికాలోని తెలుగువాళ్ళందరూ ఒక్క చోట కలిశారంటే అన్ని పండుగలు ఒక్కేసారి చేసుకుంటే ఎంత సంబరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.ఏ దేశంలో ఉన్నా సరే తెలుగోళ్ళా మజాకానా అని పించుకోవడంలో ఎక్కడా తగ్గరు మనవాళ్ళు.
అందుకే ఎక్కడ ఉన్నా మనదైన ముద్ర వేస్తూనే ఉంటారు.ప్రతీ రంగంలో ఎంతో ప్రతిభ కనబరించే మనవాళ్ళు అగ్ర రాజ్యంలో అగ్రగాములుగా నిలుస్తున్నారు.
అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి.ఎన్ని సంఘాలు ఉన్నా సరే అందరిది ఒక్కటే మార్గం తెలుగు వెలుగు, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు గౌరవించడం, అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందించడం, అందరూ కలిసి నెలలో ఒకసారైనా సరదాగా గడపడం.
ఈ క్రమంలోనే కాలిఫోర్నియా లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ ఆధ్వర్యంలో జల్సా కార్యక్రమాని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ పాల్గొని సందడి చేశారు.ఈ వేడుకకి ప్రత్యేక గెస్ట్ గా సిమీ వ్యాలీ పోలీస్ కమాండర్ షార్ట్స్ హాజరయ్యారు.ఈ వేడుకలు అనంతరం తాము సేకరించిన నిధులు పోలీస్ సంక్షేమానికి విరాళంగా అందించామని TATVA మెంబర్స్ అన్నారు.
పోలీస్ సంక్షేమానికి విరాళాలు అందించిన TATVA సంస్థకి అధికారి కృతజ్ఞతలు తెలిపారు
.