ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇప్పటికే ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ తరపు వాదనలు కూడా విన్నది.ఈ నేపథ్యంలో కేసు వివరాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.
హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.అయితే డివిజన్ బెంచ్ లో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
అనంతరం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.బీజేపీ పిటిషన్ ను సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసినప్పుడు ఈ అప్పీల్ లో మీ వాదనలు ఎందుకన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.